telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ తో అనుబంధంపై కత్రినా కామెంట్స్

Salman-Khan-and-Katrina-Kaif

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చివరి చిత్రం “భారత్”. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అంతేకాదు కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి చాలా రోజులుగా బాలీవుడ్ లో ఊహాగానాలు ఉన్న విషయం తెలిసిందే. కత్రినా బాలీవుడ్ కు వెళ్లిన కొత్తల్లో సల్మాన్ ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేసింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక 2017లో ఈ జంట విడిపోయింది. దీనితో కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ ఖాన్ చేరువైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కత్రినా… సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ తో తన బంధం పదహారేళ్లని చెప్పింది. సల్మాన్ చాలా ధృడమైన వ్యక్తి అని, ఆపదలు, అవసరాలు వచ్చినప్పుడు తోడుండే నేస్తమని, అతడు తరచూ టచ్ లో ఉండకపోవచ్చు కానీ తన స్నేహితులకు మాత్రం ఎప్పుడూ అండగా ఉంటాడని చెప్పుకొచ్చింది. 2005లో మొదటిసారి వీరిద్దరూ కలిసి ‘మైనే ప్యార్ క్యోం కియా’ అనే సినిమా కోసం పని చేశారు. ఆ తరువాత నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి.

Related posts