telugu navyamedia
సామాజిక

శైవక్షేత్రాలలో కార్తీక శోభ ..

కార్తీకమాసం వ‌చ్చిందంటే చాలు భక్తులు ప్రత్యేక పూజలు ఆచ‌రిస్తారు. అందులోనూ తొలి సోమవారం మరియు నాగులచవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న‌ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి బోళాశంక‌రునికి దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమయితే అది ఒక విశేషమని, ఇది శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక తొలి సోమవారం ప్రత్యేక పూజలు..

ఆంధ్ర‌ప‌దేశ్‌ రాష్టంలో ఉన్న‌పుణ్యక్షేత్రం శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామి దేవాల‌యలో స్వామివారి దర్శనానికి క్యూలైన్‎లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. తొలి సోమవారం రోజున స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ కు భక్తులు పోటెత్తారు. గోదావరి నది స్థానమాచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

Karthika Masam Celebrations at Pushkar Ghat Rajahmundry Photo Gallery - Sakshi

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ద్రాక్షరామ భీమేశ్వర స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి,కుమారరామం, మురమల్ల వేరేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామి భక్తజనసంద్రమైంది

తెలంగాణ రాష్టంలో వ‌రంగ‌ల్ చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. .

Related posts