telugu navyamedia
రాజకీయ వార్తలు

అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: కుమారస్వామి

kumara swamy

కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని జేడీఎస్‌ నాయకులు, మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున 15 మంది పోటీలో ఉంటారని ఆ పార్టీ ఆయన తేల్చిచెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు.

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు సరిగ్గా లేవని కుమారస్వామి మండిపడ్డారు. పేద ప్రజలకు సహాయం చేయడంలో యెడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నాటి స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును వేసిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి.

Related posts