రాఘవ లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వం లో కాంచన, కాంచన-2 తో హార్రర్ కామెడీ చిత్రాలతో భారీ సక్సెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన కాంచన సిరీస్ నుంచి వచ్చిన హార్రర్ కామెడీ చిత్రం కాంచన-3. మొదటి రెండు భాగాలూ సూపర్ హిట్స్ కావడం తో మూడో భాగం ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు..వారి అంచనాలను అందుకోవడం లో లారెన్స్ సక్సెస్ అయ్యాడు. తెలుగు తో పాటు తమిళ్ లో ఒకే రోజు విడుదలైన ఈ మూవీ రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ చిత్రం తమిళ నాడు లో మొదటి రోజు 10. 72 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లారెన్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది. దాని తో ఈ చిత్రం అక్కడ ఈ ఏడాది విశ్వాసం ,పేట తరువాత హైయెస్ట్ ఓపెనింగ్ జాబితాలో నిలిచిపోయింది. తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక , ఓవియా ముఖ్య పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.