telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెరికా జాతీయ జెండాకు నిప్పు

Burning

అగ్రరాజ్యం అమెరికాలో జూలై 4న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే రీవాల్యుషనరీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు నిరసనకారులు వైట్‌హౌస్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఆ దేశ జాతీయ జెండాకు నిప్పుపెట్టారు. ఈ ఘటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నివాసం నుంచి లింకన్ మెమోరియల్ వద్ద ప్రసంగానికి వెళ్లే కొన్ని గంటల ముందు చోటుచేసుకోవడంతో కలకలంగా మారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రక్షణ బలగాలు ఆ ఇద్దరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో నిరసనకారులు ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించడంతో పాటు “అమెరికా ఎప్పటికీ గొప్పది కాదంటూ” నినాదాలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వైట్‌హౌస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Related posts