telugu navyamedia
సినిమా వార్తలు

కల్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’ టీజర్‌

మెగా అల్లుడు హీరో క‌ల్యాణ్ దేవ్ న‌టిస్తోన్న చిత్రం ‘కిన్నెర‌సాని’. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. రమణ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ హీరో నితిన్‌ విడుదల చేశాడు. ‘మీ పాప ఓ అద్భుతం.. కానీ అద్భుతం జరిగే ప్రతీ చోట ఆపద ఉంటుంది’ అని ఓ అమ్మాయి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది.

ఈ టీజర్‌కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. రవీంద్ర విజయ్, ఆన్ శీతల్, మహతి బిక్షు, కాశిష్ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Related posts