telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఘనంగా ప్రముఖ లేడీ‌ డైరెక్టర్ సుధా కొంగర కూతురు వివాహం

Surya

ప్రముఖ లేడీ‌ డైరెక్టర్ సుధా కొంగర కూతురు ఉత్తర వివాహం జరగగా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మణిరత్నం, సుహాసిని మణిరత్నం, సూర్య, జీవీ ప్రకాష్‌ తదితరులు ఈ శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, అభినందనలు తెలియజేశారు. వీరి వివాహం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగింది. కాగా మణిరత్నం దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన సుధా కొంగర.. ద్రోహి అనే చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత మాధవన్‌తో ఆమె తెరకెక్కించిన ‘ఇరుదై సుత్రు’తో సుధాకు మంచి పేరు‌ వచ్చింది. ఆ తరువాత సూర్యతో సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అనే మూవీని తెరకెక్కించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది.

Related posts