నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోనే పాల ధరలు లీటరుకు రూ.2 పెరిగాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ సహాకార సంఘాలు నిర్వహించే డెయిరీలతో పాటు అన్ని ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.2 పెంచేశాయి.వెన్నశాతం తక్కువగా ఉండే టోన్డ్ మిల్క్‌ను విజయ డెయిరీ లీటరు ధర రూ. 42 విక్రయిస్తోంది. తాజాగా పెరిగిన ధరతో సోమవారం నుంచి లీటరు రూ.44గా విక్రయిస్తారు. ప్రైవేటు డెయిరీలైన హెరిటేజ్, జెర్సీ, దొడ్ల, తిరుమల డెయిరీలతో పాటు చిన్న చితక డెయిరీలు కూడా టోన్డ్ మిల్క్‌తో పాటు, స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరలు లీటరు ధర రూ.2 పెంచాయి. దీంతో ప్రైవేటు డెయిరీల టోన్డ్ మిల్క్ ధరలు రూ.46 అయ్యాయి.