అల వైకుంఠపురములో చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనుండగా, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. టబు, జయరాం, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నవదీప్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తూనే, అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లోను నర్తిస్తుంది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి కాజల్ స్పెషల్ డ్యాన్స్ చేయగా, దీనికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలసి స్పెషల్ డ్యాన్స్ చేసేందుకు ఈ అమ్మడు సిద్ధమైనట్టు సమాచారం. అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రంపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. చిత్రంకి సంబంధించి విడుదలైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా అందంగా ఉండేలా చూసుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమా కోసం ఫారెన్ డ్యాన్సర్స్, ముంబై మోడల్స్‌తో స్టెప్పులు వేస్తున్న బన్నీ.. స్పెషల్ సాంగ్‌లో ఎవరితో డ్యాన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నాడట. రంగస్థలం బ్యూటీ అనసూయ పేరు ఫ్రేములోకి వచ్చినప్పటికి బన్నీ.. కాజల్ అగర్వాల్ పేరు సిఫారసు చేస్తున్నట్టు టాక్. ఆమెని ఒప్పించి ఎలా అయిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాలని బన్నీ ప్లాన్ అట. ప్రస్తుతం కాజల్ .. ముంబై సగా అనే హిందీ చిత్రం చేస్తుంది. జాన్ అబ్రహం ముఖ్య పాత్ర పోషిస్తుననాడు. మరోవైపు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తుంది కాజల్.
previous post