telugu navyamedia
సినిమా వార్తలు

‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్ రిలీజ్‌..

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు విశేషణ స్పందన వచ్చింది.

Rakul Preet Singh's First Look Poster As Obulamma In Kondapolam - Chitrambhalare Flixadda

ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించింది. వైష్ణవ్‌, రకుల్‌ జోడి తెరపై ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం భావిస్తోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్‌ తేజ్‌.. రకుల్‌ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్‌. ఈ సాంగ్‌లో వైష్ణవ్‌-రకుల్‌ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది.

కాగా, తాజాగా రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ‘ఒబులమ్మ’ పాటను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది. వీరి లవ్‌ ట్రాగ్‌ పాటకు అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు.

సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

Related posts