*కేఏపాల్‌పై టీఆర్ ఎస్ కార్యకర్త దాడి..
*సిరిసిల్ల వెళ్తున్న కేఏపాల్‌పై అడ్డుకున్న టీఆర్ ఎస్ కార్యకర్తలు..
*సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి..
*కేఏ పాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తున్న కేఏ పాల్ ను వెళ్తున్న పాల్‌ను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు.పాల్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
కేఏ పాల్ కారు దిగి ఎందుకు అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న మరో టీఆర్ ఎస్ నేత కేఏ పాల్ చెంప పగలగొట్టారు. దీంతో గందరగోళం నెలకొంది.
పాల్‌పై దాడి చేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్‌పై దాడి చేసిన వ్యక్తిని తంగాళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన అనిల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
కాగా తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. … డీఎస్పీ సమక్షంలోనే తనపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ”మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. లేక తెరాస కార్యకర్తలా… మీకు టీఆర్ ఎస్ జీతాలు ఇస్తోందా.. లేదా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయా…” అంటూ పోలీసులపై కేఏ పాల్ మండి పడ్డారు.