telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ : ఇక వీళ్లు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందే.. లేదంటే అంతే..

parking for IT corridor is compulsory

గచ్చిబౌలీ సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సజ్జనార్ జీహెచ్‌ఎంసీ అధికారులతో ఐటీ కారిడార్ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్చించిన ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రణాళిక ప్రక్రియను రూపొందించి ఆ సమస్యను తొలిగించాలని నిర్ణయించారు.

వాటి వివరాలిలా ఉన్నాయి. – మైండ్ స్పేస్, శిల్పారామం, నెక్టర్ గార్డెన్, హైటెక్ సిటీ ఆర్‌వోబీ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చేయాలి. – ఐఐటీ జంక్షన్ విస్తరణ, అభివృద్ధి చేయాలి. – ఖాజాగూడ- బయోడైవర్సిటీ జంక్షన్ మార్గంలో రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలి. – దివ్యశ్రీ దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీని మరో ప్రాంతానికి మార్చాలి. – ఎన్ కన్వెన్షన్ ఎదురుగా సైబర్ టవర్స్ ైఫ్లెఓవర్ వద్ద రోడ్డు అభివృద్ధి పనుల నేపథ్యంలో కుదించుకుపోయిన రోడ్డు. ఆ రోడ్డులో కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. – హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ ఆర్‌వోబీ అంకుర దవాఖాన వద్ద రోడ్డు పనుల నేపథ్యంలో రోడ్డు కుదించుకుపోయింది.

హైటెక్ సిటీ ఎంఎంటీఎస్-ఆర్‌యూబీ-ఇందు ఫార్చ్యూన్-రెయిన్‌బో విస్టాస్-క్తెలాపూర్ మార్గంలోని రోడ్డును అభివృద్ధి చేయాలి. – జేఎన్‌టీయూ దగ్గర ఫుట్‌ఓవర్ బ్రిడ్జీని ఏర్పాటు చేయాలి. – ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న పార్కింగ్ సౌకర్యం లేని హోటల్స్, రెస్టారెంట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వరరావు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, టీఎస్‌ఐఐసీ, ట్రాఫిక్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts