ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు భాజపా నాయకుడు అనుపమ్ హజ్రా తెలిపారు. ఆయన ట్విట్టర్లో మిథున్ చక్రవర్తి ఫొటోను షేర్ చేసి.. త్వరగా కోలుకోవాలని కోరారు.
దీంతో ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడయా వైరల్‌గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై మిథున్ చక్రవర్తి కుటుంబసభ్యులు స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరారని, ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్ చక్రవర్తి. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో మిథున్ నటించి మెప్పించారు. దీంతోపాటు ‘హునార్‌బాజ్’ షోకి జడ్జిగా వ్యవహరించారు.
Get well soon Mithun Da ❤️
তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf— Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022