telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

హనుమవిహారి ఆట తీరుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్…

KTR

భారత్-ఆసీస్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రా అయిన విషయం తెలిసిందే. అయితే డ్రా అయినా ఇది భారత్‌కు నైతిక విజయం. అంతకన్నా కూడా విలువైందే. ఎందుకంటే.. సగం జట్టుకు గాయమైనా.. గాయాలతో ఆడడం కష్టంగా ఉన్నా రోజంతా పోరాడింది. అయితే ఈ మ్యాచ్ లో గాయం తర్వాత కూడా తన బ్యాటింగ్ కొనసాగించిన హనుమవిహారి ఆట తీరుపై మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తంచేశారు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్‌ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ… ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యానికి నిదర్శనమని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అద్భుత బ్యాటింగ్‌ చేసిన హనుమ విహారి, అశ్విన్‌ను మెచ్చకున్నారు. అలాగే ఈ డ్రా.. ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన విహారి కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పాడు. ఇక నాలుగో టెస్ట్ ఏ ఈ సిరీస్ ఎవరిది అనేది తేల్చనుంది.

Related posts