తమిళ అగ్రహీరో విజయ్ హీరోగా ‘తెరి’, ‘మెర్సల్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అట్లీ కుమార్ కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం అట్లీ, విజయ్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు సమయంలో మహిళా జూనియర్ ఆర్టిస్టుల పట్ల ఆయన చాలా అవమానకరంగా వ్యవహరించాడంటూ ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ నెల 13న షూటింగులో మంచి భోజనం గురించి, టాయిలెట్ సౌకర్యం గురించి అట్లీ కుమార్ ను అడగ్గా… ఆయన రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడని, మహిళా ఆర్టిస్టులుగా కాదు కదా కనీసం మనుషుల్లా కూడా తమని ఆయన చూడటం లేదని వాపోయింది. ఆ రోజునే ఫిర్యాదు చేయాలనుకున్నామనీ, అయితే పోలీసులంతా ఎన్నికల హడావిడిలో ఉండటం వలన ఆగిపోయామని, ఇకపై మహిళా జూనియర్ ఆర్టిస్టుల పట్ల అట్లీ ఇలా వ్యవహరించకుండా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై అట్లీ కుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
next post
బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ మిస్టేక్ ఇదేనా?