telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ, త్రివిక్రమ్ సినిమా ప్రారంభం

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.”నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో జయరాం, సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా హాసినీ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ఈరోజు (బుధ‌వారం) ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్‌కు, బ‌న్నీకి, పూజా హెగ్డేకు, సినిమాటోగ్రాఫ‌ర్ పీఎస్ వినోద్‌కు, నిర్మాత‌ల‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశాడు. ఈ సినిమాకు `అల‌క‌నంద‌` అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది.

Related posts