telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ర్ట‌వాప్తంగా పార్టీ బ‌లోపేతం దిశగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్ధం అయ్యారు. అక్టోబర్ 5 విజయదశమి రోజున‌ తిరుపతి నుంచి ఆయన పర్యటన ప్రారంభ‌కానున్నాయి.

ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటన, ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

శుక్రవారం జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఏపీలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని, జనసైనికులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ దిశానిర్ధేశం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకుని, అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని అన్నారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం, ప్రజలను చైతన్య పరచడం కోసం పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపడుతున్నారని చెప్పారు. ప్ర‌భుత్వం త‌రిమికొట్టి ..ఇంటి పంపించే విధంగా సిద్ధ‌మ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు.

కాగా..ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏపీ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడానికి ఎనిమిది నెలల డెడ్ లైన్ పెట్టారు. అంటే ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నారు.

అందుకే అన్ని రాజకీయ పార్టీలు యాత్రలు చేస్తున్నాయి. టీడీపీ కూడా జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమాల షూటింగ్స్ ను వచ్చే దసరా లోపుపూర్తి చేసి .. అప్పట్నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండాలని పవన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Pawan Kalyan gives YSRCP a week to get action plan ready

తమకు సెంటిమెంట్ గా భావించే తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉండడంతో.. అక్కడ నుంచి పర్యటన మొదలపెడతారని జనసైనికులు అంటున్నారు.

Related posts