నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరగడం, ఆలయం ఎదుట కొత్తజంట ఫొటోషూట్‌లో పాల్గొనడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించి భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు. దీంతో ఈ నయనతార దంపతుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త విఘ్నేష్ శివన్ క్షమాపణలు కోరుతూ ఒక లేఖ విడుదల చేశారు.
క్షమాపణ కోరిన నయన్, విఘ్నేశ్ ..
మేం తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఈ క్రమంలోనే గడిచిన 30 రోజుల్లోనే 5 సార్లు ఈ కొండకు వచ్చాం. అయితే, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మహాబలిపురంలో మా వివాహం జరిగింది. పెళ్ళైన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా మండపం నుంచి నేరుగా తిరుపతి వచ్చి.. స్వామి కళ్యాణం చూసి ఆశీర్వాదం తీసుకోవాలని, అదే విధంగా శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నాం.. దర్శనం బాగా జరిగింది. ఇది మాకు జీవితాంతం గుర్తు ఉండాలని ఒక ఫొటోషూట్ తీసుకోవాలని అనుకున్నాం.
అయితే… ఆసమయంలో ఆలయ ఆవరణలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి మళ్లీ రావాల్సి వచ్చింది. అప్పడు ఫొటోషూట్ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తించలేదు. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అని విఘ్నేశ్ శివన్ రాసుకొచ్చారు.