telugu navyamedia
తెలంగాణ వార్తలు

సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ.. ఈ క్షణం నుంచి పార్టీలో లేన‌ట్టే- జ‌గ్గారెడ్డి

*సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి బ‌హిరంగ లేఖ‌..
*పార్టీలో జ‌ర‌గుతున్న అవ‌మానాల‌పై లేఖ‌లో ప్ర‌స్తావ‌న‌..
*తెలంగాణ కాంగ్రెస్‌లో జ‌గ్గారెడ్డి సంక్షోభం
*నా వ‌ల్ల పార్టీకి, కార్య‌క‌ర్త‌ల‌కు న‌ష్టం క‌ల‌గ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో జ‌గ్గారెడ్డి..
*రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మేల్యేలు..
*రాజీనామాపై రెండు రోజుల్లో నిర్ణ‌యం..
*త్వ‌ర‌లో నా రాజీనామా పత్రం పంపిస్తా..
* ఈ ప్ర‌క‌ట‌న త‌రువాత కాంగ్రెస్‌లో లేన‌ట్టే..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , ఎంపీ రాహుల్ గాంధీలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీలో జ‌ర‌గుతున్న అవ‌మానాల‌పై లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

అంతేకాదు ఈ ప్రకటన తర్వాత తాను కాంగ్రెస్ లో లేనట్టే అని తెలిపారు ఆ‍యన. త్వరలో తన రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నట్లు వెల్లడించారు.  సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని..పార్టీలో ఉండి నింద‌లు ఉండాల్సిప‌ని ఏంటి?. రెండురోజుల్లో  పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉండేదని.. కానీ, అది ఎంతో హుందాగా ఉండేదని.. కానీ, ప్రస్తుతం హుందా తనం లేదని దుయ్యబట్టారు జగ్గారెడ్డి.

కాంగ్రెస్ నుండి చాలా మంది బయటకు వెళ్లారని జోస్యం చెప్పిన ఆయన.. సడెన్‌గా వచ్చి లాబియింగ్ చేసుకుని పీసీసీ కావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. సొంత పార్టీ నాయకులే కోవర్టు అని ప్రచారం చేయడం.. దాన్ని ఖండించే పరిస్థితి కూడా పార్టీలో లేదని మండిపడ్డారు జగ్గారెడ్డి.

నా తల్లి పెంపకం నలుగురికి మేలు చేసే తత్వం నేర్పిందన్న ఆయన.. నేను అప్పులు అడుగుతా తప్పితే.. చందాలు కూడా అడగను అన్నారు.. ఇక్కడ ఉండి కోవర్ట్ అని అనిపించుకోవడం ఎందుకు నాకు..? అని ప్రశ్నించిన ఆయన.. తప్పులు సరిదిద్దుకోండి అంటే… కోవర్టు అని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవం తో ఉంటానని.. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా….? తానా అని ఆయన నిలదీశారు.

గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది తానేనని జగ్గారెడ్డి గుర్తుచేశారు. మరి పార్టీలో పదవులు అనుభవిస్తూ.. స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా అనేది అధిష్టానం గుర్తించాలని ఆయన హితవు పలికారు. 

Related posts