వైసీపీ అధినేత జగన్ కడప జిల్లా పులివెందులలో శుక్రవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే నియమం ప్రకారం అభ్యర్థి తనపై ఉన్న కేసులను కూడా నామినేషన్ పాత్రలలో పేర్కొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా తనపై ఉన్న కేసులు, వాటి దర్యాప్తు వివరాలను వాటిలో వెల్లడించారు. మొత్తం 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు, పోలీస్ స్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ కేసుల్లో చాలా వాటిని విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అలాగే, తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు వివరించారు. పరువు నష్టం దావా, రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన కింద నమోదైన కేసులు కూడా ఉన్నట్టు వివరించారు. నామినేషన్ పత్రాల్లో జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయనపై మొత్తం 31 కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్‌పై సీఎం జగన్ కొత్త అర్థాలు: సోమిరెడ్డి