telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అంతర్జాతీయ కోర్టులో .. భారత్ ఘనవిజయం.. కులభూషణ్ ఉరి నిలిపివేత..

india got positive statement on kulbushan case

భారత పౌరుడు కుల్‌భూషణ్‌ జాధవ్‌ను గూఢచర్యం ఆరోపణలతో పాక్ అరెస్టు చేయడం, ఆ దేశ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న మరణ శిక్షను విధించడం జరిగింది. దీనిపై భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించగా, నేడు తీర్పు వెలువరించిన సదరు కోర్టు, భారత్ కు అనుకూలంగా, కులభూషణ్ ఉరిని నిలిపివేయాలని, పునఃసమీక్షించాలని సూచించింది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో జాధవ్‌ తఫును న్యాయవాదిని నియమించుకునే హక్కు కూడా భారత్‌కు ఉందని ఐసీజే స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరైనదేనని, ఇది ఐసీజే పరిధిలోకి వస్తుందని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మొత్తం 16 మంది న్యాయమూర్తులలో 15 మంది భారదేశానికి అండగా నిలిస్తే, పాక్ కు చెందిన అడ్‌హాక్ జడ్జి జిలానీ మాత్రమే వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాక్ అభ్యంతరాలన్నింటినీ మెజారిటీ న్యాయమూర్తులు తోసిపుచ్చారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేయాలని, స్వదేశానికి పంపించాలని భారతదేశం చేసిన విజ్ఞాపనకు కోర్టు అంగీకరించలేదు.

ఈ కేసులో తీర్పును వెలువరిస్తూ ఐసీజే మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. అదేమంటే, ఇన్నేళ్ళుగా కుల్‌భూషణ్ జాధవ్‌కు న్యాయపరమైన సహకారం ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆక్షేపించింది. జాధవ్‌కు విధించిన మరణశిక్షపై మళ్ళీ విచారణ జరపాలని సూచించింది. స్థూలంగా చెప్పాలంటే భారతదేశం చేసిన వాదనల్లో చాలా వాటిని అంతర్జాతీయ కోర్టు సమర్థించింది. ఈ పరిణామాన్ని భారతదేశం సాధించిన విజయంగా భావిస్తున్నారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత కులభూషణ్ జాధవ్ గ్రామం(మహారాష్ట్ర సతారా జిల్లాలోని అనావాడీ) లో సంబరాలు జరుపుకోవడం కనిపించింది. భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ తీర్పును భారత విజయంగా వర్ణించారు.

Related posts