telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఇక మెట్రో స్టేషన్లలో వైజ్ఞానిక ప్రదర్శనలు!

metro train hyd

సామాజిక అవగాహన కోసం ఇక మెట్రోరైలు స్టేషన్లలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మెట్రోరైలు స్టేషన్లలో ప్రయాణేతర కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. సామాజిక బాధ్యతగా ఐఐసీటీతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టును సైన్స్‌కు అనుగుణంగా మరల్చడానికి సిద్ధమయ్యారు. ప్రతి స్టేషన్లో రసాయన, భౌతిక శాస్ర్తానికి సంబంధించిన ఫార్ములాలు, పరిశోధనలకు సంబంధించిన నమూనాలు, సమాచారంతో కూడిన ప్రదర్శనలను మెట్రో కారిడార్లలోని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు.

ఐఐసీటీ భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఎగ్జిబిషన్స్‌లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కీలక భాగస్వాములుగా ఉంటారు. ప్రజా జీవితాల్లోకి సైన్స్‌ను మరింత విస్తృతం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు. మెట్రోరైలు కారిడార్లలో ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ ప్రదర్శనలు అందుబాటులోకి రానున్నాయి.

Related posts