telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ మారిన మెట్రో రైలు సమయాలు…

rayadurgam metro line starts on 29th

పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు నుండి లాక్ డౌన్ అమలులోకి తెచ్చింది. దాంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు. అంతకనుందు నైట్ కర్ఫ్యూ సమయంలో కూడా ఇలానే చేసారు. ఇక ప్రస్తుతం ఉదయం 7 నుంచి ఉదయం 8:45 వరకే మెట్రో సేవలు ఉండనున్నాయి. ఉదయం 8:45 కే చివరి మెట్రో నడవనుంది. ఉదయం 9:45 చివరి స్టేషన్ కు మెట్రో రైలు చేరుకోనుంది. అయితే ఈ ప‌ది రోజుల పాటు లాక్ డౌన్ లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు మిన‌హాయింపు నిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ ప‌నులు కూడా య‌థావిధిగా చేసుకోవ‌చ్చ‌ని, వైద్య రంగం, విద్యుత్, మీడియా, పెట్రోల్ బంకుల‌కు లాక్ డౌన్ నుంచి మిన‌హాయింపు ఉంద‌ని తెలిపింది.

Related posts