telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సోనియా ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నానంటున్న కాంగ్రెస్ నేత…

నేను బీజేపీలోకి సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే వెళ్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కోవర్టుల వలనే కాంగ్రెస్ పతనమైందన్న ఆయన దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని అన్నారు. కాంగ్రెస్ నాశనానికి రాష్ట్ర నాయకత్వం కారణమని, నాలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్  నాయకత్వం గౌరవించటం లేదని అన్నారు. సోనియా గాంధీ నాకు తల్లి.. రాహుల్ గాంధీ నా తమ్ముడన్న ఆయన సోనియా ఆరోగ్యం క్షీణించింది.. రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు అందుకే తాను మరో దారి చూసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాను ఒప్పించింది నేనేనన్న ఆయన ఇప్పుడు గాంధీ భవన్ పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుంది అని అన్నారు. మోదీనే దేశ భవిష్యత్తు. మరో 20 ఏళ్లు బీజేపీదే  అధికారం అని ఆయన అన్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పేర్కొన్న ఆయన నా లాంటి వాళ్ళందరూ కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 

Related posts