రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసిన కాంగ్రెస్ వారిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై రాజస్థాన్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై నిన్న విచారణ జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ వీరిద్దరినీ బహిష్కరించడం గమనార్హం.
పైలట్‌కు కాంగ్రెస్ ద్వారాలు ఇంకా తెరిచే ఉంచింది. పదవుల నుంచి తప్పిస్తూ తనకు ఇచ్చిన నోటీసులపై పైలట్ కోర్టుకెక్కినప్పటికీ, ఆయన వెనక్కి వస్తే తిరిగి అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైలట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు అధిష్ఠానం సూచించినట్టు సమాచారం. దక్షిణాదికి చెందిన ఓ నేతతో పైలట్ సంప్రదింపులు జరపగా ప్రస్తుత పరిణామాలను మరిచిపోయి ఆహ్వానించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: అమిత్ షా!