telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాదయాత్రకు సిద్దమైన .. లోకేష్ బాబు..! నిబంధనలు వర్తిస్తాయి.. !!

టీడీపీ నేత నారా లోకేశ్ తాజా ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక నారా లోకేశ్ మీడియా ముందుకు కూడా రాలేదు. అధికార పక్షంపై విమర్శలు చేయాల్సి వస్తే ట్విట్టర్ ద్వారా విమర్శిస్తున్నాడు. కానీ నారాలోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి కాకుండా విడతల వారీగా నారాలోకేశ్ పాదయాత్ర చేయబోతున్నాడట. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర సెంటిమెంట్ బాగానే ఫలితాల్ని ఇస్తుంది. 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వై యస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

అలాగే 2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. ఇలా పాదయాత్ర చేసిన వారంతా ఆంధ్రప్రదేశ్లో సీఎంలుగా గెలిచారు. నారా లోకేశ్ కూడా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోను, నాయకుల్లోను ఉత్సాహం నింపాలని భావిస్తున్నాడట. పాదయాత్ర చేయటం ద్వారా లోకేశ్ తన ఇమేజ్ కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాడట. ఈ పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో బలహీనపడిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని లోకేశ్ భావిస్తున్నాడట. లోకేశ్ ఈ పాదయాత్ర ఎప్పటినుండి చేయబోతున్నాడో .. లాంటి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Related posts