మన దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి మరి దారుణంగా ఉంది. రోజుకు నాలుగు లక్షలకు పాగా కేసులు వస్తుండటంతో అందరూ భయపడుతున్నారు. పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది. యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది. ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ట్రంప్ కు ఈ ఔషధాన్ని వైద్యులు సూచించారు. స్విట్జర్లాండ్ కు చెందిన రోచ్ సంస్థ ఈ ఔషధాన్ని తయారు చేసింది. సిప్లా కంపెనీ ఇండియాలో దీనిని పంపిణి చేయనున్నది.
previous post
next post
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్