telugu navyamedia
క్రీడలు వార్తలు

గిల్ కు గవాస్కర్ సూచనలు…

గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కనబర్చాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో పాటు ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్‌ల్లే కేవలం 132 పరుగులే చేశాడు. అయితే ఫామ్ కోల్పోయిన శుభ్‌మన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. డబ్ల్యూటీసీ, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేసిన 20 మంది జట్టులో ఈ యువ ఓపెనర్‌కు చోట కల్పించింది. ఈ నేపథ్యంలోశుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడిన గవాస్కర్ అతని వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించాడు.‘శుభ్‌మన్ గిల్‌ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాల పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్‌ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కారణంగానే ఇలా విఫలమవుతున్నాడని అనిపిస్తోంది. వీలైనం త్వరగా ఆ ఒత్తిడి నుంచి శుభ్‌మన్ బయటపడాలి’ అని గవాస్కర్‌ వివరించాడు.

Related posts