telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హెచ్‌-1బీ సమస్యల పరిష్కారానికి కృషి: జో బైడెన్

Joe Biden USA

అమెరికా ఇచ్చే హెచ్‌-1బీ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్భరోసా ఇచ్చారు. తాజాగా భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. హెచ్-1బీ వీసా, జాత్యహంకారం వంటి అంశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆయన విమర్శించారు.

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భావితరాలకు మంచి భవిష్యత్తును అందిస్తానని చెప్పారు.భారత సంతతికి చెందిన అమెరికావాసులపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు తమ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్ని నెలకొల్పారని ఆయన కొనియాడారు. సిలికాన్‌ వ్యాలీకి పునాదులు వేశారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉన్న కంపెనీలకు వారు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. అమెరికాలో వారు సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారని ఆయన అన్నారు.

Related posts