ఈ మధ్యే ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు. దిగుమతి చేసుకునే ఔషదాలు, వివిధ మెడికల్ పరికరాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మమత బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. వివిధ సంస్థలు, ఏజెన్సీలు, వ్యక్తులు ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వైద్య పరికరాలను అందిస్తున్నారని, వాటికి జీఎస్టీ, పన్ను మినహాయింపులు ఇవ్వాలని మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. అయితే చూడాలి మరి దీని పై మోడీ ఎలా స్పందిస్తారు… అనేది.
previous post