telugu navyamedia
వార్తలు సామాజిక

ఈ నెల 21 నుంచి పట్టాలెక్కనున్న మరో 40 రైళ్లు!

కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా 80 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి. వీటిలో చాలా వరకు రైళ్లు బీహార్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య తిరగనున్నాయి.

ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో-ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు మే నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 

Related posts