టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఈయన 40 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్నారు.. 15 వందలకు పైగా సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, రామ్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు పనిచేశారు. శ్రీరెడ్డి, బాలక్రిష్ణ, ఎన్టీఆర్, ఇలా చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులపై సంచలన కామెంట్స్ చేస్తూ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న రాకేష్ మాస్టర్ మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచులక్ష్మిపై సంచలన కామెంట్స్ చేశారు. శ్రీరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారని రాకేష్ మాస్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ శ్రీరెడ్డి చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.