telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘కరోనా’ను ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు: సీఎం జగన్

jagan

ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కరోనా వైరస్ నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి హాజరయ్యారు. ‘కరోనా’ను ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు సిద్ధం చేయాలన అధికారులను ఆదేశించారు. విజయవాడ, అనంతపురంలో ప్రత్యేక వార్డులకు రూ.60 కోట్లు కేటాయించాలని సూచించారు.

‘కరోనా’ నిరోధంలో గ్రామ సచివాలయాలను భాగస్వాములను చేయాలని అన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని ఆదేశించారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్ వచ్చాయని, నాలుగు కేసులకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని జగన్ కు అధికారులు తెలిపారు.

Related posts