telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం .. తీపిజ్ఞాపకాలు ఎన్నో..

world tourism day on sep 27th

రేపు(సెప్టెంబర్ 27) అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. 1970 ప్రాంతంలో యుఎన్‌డబ్ల్యుటిఓ(UNWTO) శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టారు. గ్లోబల్ టూరిజంలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజది. ఆ తర్వాత 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరపాలని నిర్ణయించారు. అప్పట్నుంచీ – ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సప్ట్‌తో నిర్వహిస్తున్నారు. 1980లో – ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.

పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వాలు పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తోంది. ఈ శాఖ జాతీయ స్ధాయిలోనూ, రాష్ట్ర స్ధాయిల్లో కూడా పర్యాటకాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఎన్నో బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇప్పటికీ అజంతా,ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్ధాన్ థార్ ఎడారి, తాజ్ మహల్, ఢిల్లీ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబై) ,విశాఖపట్టణం ఆర్కే బీచ్, గోదావరి అందాలు, కృష్ణమ్మ హొయలు, అరకు లోయ, బొర్రా గుహలు, హార్సిలీ హిల్స్, మహానంది, బ్రహ్మంగారి మఠం, హైదరాబాద్‌లో గల చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, అసెంబ్లీ హాలు, జూబ్లీహాలు, ఎన్టీఆర్ గార్డెన్, ఇవన్నీ పర్యాటక ప్రదేశాలే. ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. ఇవ్నీ ఒక ఎత్తయితే గోవాలాంటి బీచ్‌లు కూడ యువతను ఆకర్షిస్తూ ఉంటాయి.

పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వాలు పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తోంది. ఈ శాఖ జాతీయ స్ధాయిలోనూ, రాష్ట్ర స్ధాయిల్లో కూడా పర్యాటకాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఎన్నో బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇప్పటికీ అజంతా,ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్ధాన్ థార్ ఎడారి, తాజ్ మహల్, ఢిల్లీ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబై) ,విశాఖపట్టణం ఆర్కే బీచ్, గోదావరి అందాలు, కృష్ణమ్మ హొయలు, అరకు లోయ, బొర్రా గుహలు, హార్సిలీ హిల్స్, మహానంది, బ్రహ్మంగారి మఠం, హైదరాబాద్‌లో గల చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, అసెంబ్లీ హాలు, జూబ్లీహాలు, ఎన్టీఆర్ గార్డెన్, ఇవన్నీ పర్యాటక ప్రదేశాలే. ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. ఇవ్నీ ఒక ఎత్తయితే గోవాలాంటి బీచ్‌లు కూడ యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. దేశానికి సంబంధించిన ఎన్నో చారిత్రక విశేషాలను మరో దేశానికి చెందిన వారు స్వేచ్ఛగా వచ్చి చూసేలా వారికి ఎన్నో విధాలుగా మన ప్రభుత్వాలు సేవలందిస్తున్నాయి.

Related posts