నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం భాస్కర్ ప్రొడక్షన్స్ వారి “చెరపుకురా చెడేవు”
06-07-1955 విడుదలయ్యింది.
దర్శక-నిర్మాత కోవెలమూడి భాస్కరరావు గారు
భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి మాటలు: సముద్రాల రామానుజాచార్య,
పాటలు: రావూరి, సముద్రాల ,కొసరాజు,
సంగీతం: ఘంటసాల, ఛాయాగ్రహణం: కమల్ ఘోష్,
నృత్యం: వెంపటి సత్యం, కళ: సి.ఎచ్.ఇ.ప్రసాద్,
కూర్పు: ఎం.వి.రాజన్, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, యస్.జానకి, లక్ష్మిరాజ్యం, పుష్ఫలత, రాజసులోచన,సూర్యాకాంతం, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, అల్లు రామలింగయ్య, అమరనాథ్, తదితరులు నటించారు.
ప్రఖ్యాత నేపధ్యగాయకులు, సంగీత దర్శకులు
ఘంటసాల గారి సంగీత సారధ్యంలో
“గులాబీల తోట బుల్ బుల్ పాట”
“ఆపకురా మురళి, ఆపకురా మురళి గోపాల”
“ప్రేమో ప్రేమో ప్రేమా ప్రేమా రామా రామా రామా”
“అందాల నారాజ రావోయి, సందె వెన్నెల
వెంట తేవోయి”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.
ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలు కేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు (50 రోజులు) జరుపుకున్నది.
విజయవాడ – శ్రీలక్ష్మిటాకీస్ లో 56రోజులు ప్రదర్శింపబడింది.
ఈ సినిమా “ఇల్లారమే ఇంబం”(1956) పేరుతో తమిళంలోకి డబ్బింగ్ చేయబడింది….
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా