వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడువిమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి లక్షల మంది పేదల పొట్టకొట్టారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లీ ఇసుక కష్టాలు? అంటూ ట్విట్టర్ లో నిలదీశారు.
పండుగ వేళ పేద కుటుంబాలు పస్తులుండే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. సరైన ఇసుక విధానం లేకుండా చేసి నిర్మాణ కార్మికులను అప్పుల పాలయ్యేలా చేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారని ఆరోపించారు. ఇవన్నీ పేదల పొట్టకొట్టి వైసీపీ నేతల జేబులు నింపే అకృత్యాలు అంటూ ట్వీట్ చేశారు.
ఆనాడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఎంతో బాగుండేది: విజయశాంతి