telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుంది..నిద్ర కూడా పట్టదు.. మ‌హ‌నాడు చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

*క్విట్ జ‌గ‌న్.. సేవ్ ఆంద్ర‌ప్ర‌దేశ్‌..
*వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ
*బాల‌కృష్ణ సినిమా ఆడ‌కుండా ఆంక్ష‌లు పెట్టారు..
*సినిమా వాళ్ల‌ను గుప్పింట్లో పెట్టుకోవాల‌ని ప్రయ‌త్నించారు..
*సినిమాల‌కు నువ్వు ప‌ర్మిష‌న్ ఇస్తావా..?
*మ‌హానాడు బ‌స్సుల‌కు గాలి తీస్తున్నారు..
*అధికారం పోతే వైసీపీ ఆ బ‌స్సులు కూడా ఉండ‌వు..
*పోలీసులు మీ గాలీ కూడా తీస్తా..జాగ్ర‌త్త‌గా ఉండండి..
*జ‌గ‌న్ అవినీతి మొత్తం క‌క్కిస్తా..
*బీసీలు వైసీపీలో బానిస‌లుగా ప‌ని చేస్తున్నారు..
*విభ‌జ‌న‌కంటే ..క‌రోనా కంటే.. జ‌గ‌న్ ప‌రిపాల‌న వ‌ల‌నే న‌ష్టం..

ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్విట్ జ‌గ‌న్‌- సేవ్ ఆంద్ర‌ప్ర‌దేశ్ అని 5కోట్ల ఆంధ్ర‌ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలివచ్చారని ఆయన తెలిపారు.

టీడీపీకి జనాలు ఉన్నారని.. వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవన్నారు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. తాడోపేడో తేల్చుకుందామని మీరంతా ఇక్కడికి వచ్చారని ఆయన కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.

మ‌హానాడుకు అడ్డుకోవడానికి పోలీసులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుంది. ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.

భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నామ‌ని అన్నారు.ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతామ‌ని చంద్రబాబు తెలిపారు.

బాల‌కృష్ణ ఎన్టీఆర్ సినిమా ను అడ్డుకోవాల‌ని చూశారు..కానీ..ఆఖండ‌ను అభిమానులు ఘ‌న విజ‌యం సాధించింది. సినిమా వాళ్ల‌ను గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తారా అంటూ చంద్ర‌బాబు ప్రశ్నించారు. సినిమా విడుద‌ల కావాలంటే మీ ప‌ర్మిష‌న్ కావాలా? అని అన్నారు. రేపు నీ పేప‌ర్‌, టీవీ భారతీ సిమెంట్స్‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చేది నేనే..ఎట్లాన‌డుపుతావ్ అని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ..అన్ని ఎంక్వైరీ చేయిస్తానని…జ‌గ‌న్ అవినీతి మొత్తం క‌క్కిస్తామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. 

నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారం పెంచేశారని.. సీఎం జగన్ ఒక ఉన్మాది, చేతకాని దద్దమ్మ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు ఎక్కువని టీడీపీ అధినేత మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలే కాదు.. కూరగాయల ధరలూ భారీగా పెరిగిపోయాని చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితి రానివ్వకూడదని.. రౌడీల గుండెల్లో నిద్రపోయిన పార్టీ టీడీపీ అని ఆయన గుర్తుచేశారు.

Related posts