telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తనువు కప్పుకోవటానికి వస్త్రం కావాలిగానీ…. అర్ధనగ్న ప్రదర్శనకు కాదు!

తనువు కప్పుకోవటానికి
వస్త్రం కావాలిగానీ….
అర్ధనగ్న ప్రదర్శనకు కాదు!
విద్యనభ్యసించటానికి
విద్యాలయాలుగానీ….
వికారాలు పోవటానికి కాదు!
జీవించటానికి తినాలిగానీ….
తినటానికి జీవించకూడదు!
న్యాయం కోసం కోర్టులుగానీ….
వకీల్ల వాక్చాతుర్యానికి కాదు!
ధర్మం కోసం చట్టంగానీ….
వ్యాజ్యం కోసం కాదు!
వైద్యం కోసం ఆసుపత్రులుగానీ….
వైద్యుల ఉపాధి కోసం కాదు!
భక్తికోసం దేవాలయాలుగానీ….
భక్తుల ఆర్భాటానికి కాదు!
ప్రజలకోసం ప్రభుత్వంగానీ….
పాలకుల భోగం కోసం కాదు!
పాలన కోసం ఎన్నికలుగానీ…
పైసలకు ఓటు అమ్మటానికి కాదు!
ప్రజా సేవకు పదవిగానీ….
పైసల పోగేతకు కాదు!
భవ్య జీవన మార్గానికి.. కవిత్వంగానీ….
బిరుదులు ..బహుమతులకోసం కాదు !
కుళ్ళు కడగటానికి కవనం గానీ….
కాసుల సంపాదనకు కాదు!
పోరాటానికి కలంగానీ….
ప్రచారానికి కాదు!
మోక్షంకోసం జ్ఞానంగానీ…
మాయలో మునగటానికి కాదు!
అన్యాయం అడ్డటానికి బలంగానీ….
అక్రమాలు చేయటానికి కాదు!
విలువలు కోసం వివాహంగానీ….
విడాకుల కోసం కాదు!
అనుబంధం కోసం అర్ధాంగిగానీ….
అష్ట కష్టాలు పెట్టటానికి కాదు!
ముక్తి కోసం జీవితంగానీ….
మోహం కోసం కాదు!
పౌరులుగా మారటానికి పిల్లలుగానీ….
పనికిమాలినవాళ్ళలా పెరగటానికి కాదు!
కలిసుండటానికి సంఘంగానీ….
కొట్టుకుచావటానికి కాదు!

Related posts