telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నారా వారి పాలన కాదు సారా వారి పాలన: ఎమ్మెల్యే రోజా

Nagari TDP Ticket Gali Brothers

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అసెంబ్లీల్లో ఈరోజు ప్రవేశేపెట్టిన విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వీధికో బెల్టు షాపు ఉండేదని, నారా వారి పాలన కాదు సారా వారి పాలన అన్నట్టు ఆయన పాలించారని ఎద్దేవా చేశారు. బెల్టు షాపులను రద్దు చేస్తామన్న హామీతో నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తాను చేసిన సంతకాన్ని తానే అమలు చేసుకోలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబు మద్యం పాలసీ వల్ల గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. బాబు పాలనలో విశాఖ బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని చూస్తే తాము అడ్డుకున్నామని గుర్తుచేశారు. బెల్టు షాపుల రద్దుపై తన తొలి సంతకాన్ని అమలు చేయలేకపోయిన చంద్రబాబును మహిళలు క్షమించరని దుయ్యబట్టారు.

Related posts