telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

శ్రీలంక ఎఫెక్ట్ : భారీ బందోబస్తు మధ్య.. రంజాన్ వేడుకలు..!

huge security on ramzan celebrations

నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తాజాగా ఆయన మక్కా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. అనంతరం మక్కా మసీదులోని ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల పనితీరును గమనించారు. త్వరలో ప్రారంభం కానున్న రంజాన్ మాసంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు భద్రతా చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

24 గంటలు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారని తెలిపారు. చార్మినార్ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఏఎఫ్ సిబ్బందికి సీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగను అందించారు. నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్ ఎస్బీ తరుణ్‌జోషి, ట్రాఫిక్ డీసీసీ బాబురావు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్, చార్మినార్ ఏసీపీ అంజయ్య, ట్రాఫిక్ ఏసీపీ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts