telugu navyamedia
తెలంగాణ వార్తలు

నీత్ ఆయోగ్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం – ప్రెస్ మీట్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డి

*తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌..
*నీత్ ఆయోగ్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం
*కేంద్ర‌ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తున్నాం..
*నేతి బిర‌కాయ‌లో నెయ్యి ఎంత ఉంటుందో..నీత్ ఆయోగ్ లో నీతి అలా ఉంది..
*దేశంలో ద్వేసం అస‌హ‌నం పెరిగిపోయాయి..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా..నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

శ‌నివారం సాయంత్రం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చారన్నారు. నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయాలను ప్రధాని అమలు చేయడంలేదన్నారు.

మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్‌, మిషన్‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందన్నారు. అయితే నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్ర పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

మిషన్‌ కాకతీయ, భగీరథ పూర్తయినా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఉండాలని సూచించారు. 20 ఏళ్ల విజన్ ఉండాలని ఆలోచనలు జరిగాయి. ఇందులో భాగంగానే నెహ్రూ ప్రధాని అయ్యాక పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, ఎల్ఐసీలను తీసుకొచ్చారు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. నీతి ఆయోగ్‌లో నీతి అంతే ఉంద‌ని అన్నారు . నీతి ఆయోగ్ సిఫారసుల ఆచరణ పెద్ద జోక్‌గా మారింది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో అనేక పరిస్థితులు దిగజారాయి.

దేశంలో దేషం, విద్వేషం, అసహనం పెరిగిపోయింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు..

Related posts