పాకిస్థాన్ ప్రస్తుతం చెప్పుకోలేనంత అప్పుల్లో కూరుకుపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అప్పులు భారీగా పెరిగిపోయాయని నిపుణులు చెప్తున్నారు. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2005 పాక్ ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. ద్రవ్యోల్బణం ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 శాతానికి మించి ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఆ ద్రవ్యోల్భణం 8.5 శాతానికి పెరిగింది. 2019 వ సంవత్సరంలో పాక్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉంటె, రెండేళ్లలో అంటే 2021లో ఆ అప్పులు 45 ట్రిలియన్లకు పెరిగింది. ఈ స్థాయిలో అప్పులు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే పాక్ లో ఒక్కొక్కరిపై సరాసరి లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నది. లెక్కల ప్రకారం ఇమ్రాన్ పాక్ కు ప్రధాని అయ్యాక 46శాతం మేర అప్పులు పెరిగాయని, గతంలో దేశం పరిస్థితి పెద్దగా బాగాలేకపోయినా అప్పులను పెంచుకోకుండా చూసుకున్నారని, కానీ, ఇమ్రాన్ ప్రధాని అయ్యాక అప్పులు పెద్ద సంఖ్యలో పెరిగిపోయాయని, నివేదికలు చెప్తున్నాయి. చూడాలి ఇలాటి ఈ అప్పులో నుండి ఆ దేశం ఎప్పుడు బయటపడుతుంది అనేది.
previous post
విపక్ష నేతలు గులాబీ గూటికి బారులు: జగదీష్ రెడ్డి