telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అర్థరాత్రి అచ్చెన్న డిశ్చార్జ్ హైడ్రామా!

Tdp Achennaaidu

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడి విషయంలో నిన్న రాత్రి హైడ్రామా జరిగింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన్ను అవినీతి నిరోధక శాఖ అధికారుల కస్టడీకి ఇస్తూ, విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓ డాక్టర్, ఆయన న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించవచ్చని, అచ్చెన్నాయుడు మంచంపైనే ఉండి సమాధానాలు ఇవ్వవచ్చని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కోర్టు ఉత్తర్వులు వెలువడగానే అచ్చెన్నాయుడిని గురువారం డిశ్చార్జ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. వెంటనే అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి పంపాలన్న ఒత్తిడి ఆసుపత్రి డాక్టర్లపై పెరిగిందని వారు వెల్లడించారు. అంతకుముందు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీసు అధికారులతో కలిసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం. అర్థరాత్రి డిశ్చార్జ్ పత్రాన్ని ఎలా ఇస్తారని, అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాదులు ప్రశ్నించగా ఈ విషయంలో తుది నిర్ణయాన్ని ఉన్నతాధికారులు తీసుకుంటారన్న సమాధానం వచ్చిందని వారు తెలిపారు.

Related posts