పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. ఈరోజు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 53, 850 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 49, 370 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 51, 240 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ.46, 900 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 200 తగ్గడంతో రూ. 66, 500కు చేరింది.
previous post
next post
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు