చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రం చేసుకుంటే మాత్రమే సరిపోదు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలకు సంబంధించిన వివరాలు ఇవి…
1. నీళ్లలో పుదీనా, వాము వేసి ఆవిరి పట్టాలి.
2. లవంగాల పొడిని వేసి లేదా చక్కెరతో కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.
3. నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె లేదా నెయ్యిని మూడు లేదా నాలుగు చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకోవాలి.
4. ఒక టేబుల్ స్పూన్ నువ్వల నూనె లేదా కొబ్బరినూనెను నోట్లో వేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేయాలి. రెండు, మూడు నిమిషాలు చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. రోజులో ఒకటి రెండు సార్లు ఇలా చేయాలి.
5. రోజంతా గోరు వెచ్చని నీటిని తాగాలి.
6. ప్రతి రోజూ యోగాసనాలు వేయాలి. ప్రాణాయామం చేయాలి. కనీసం అర గంట పాటు ధ్యానం చేయాలి.
7. పసుపు, జీలకర్ర, కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగించాలి.
8. ప్రతి రోజూ ఉదయం ఒక టేబుల్‌స్పూన్ చ్యవన్‌ప్రాశ్‌ను తీసుకోవాలి.
9. హెర్బల్ టీని తాగాలి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసుకుని తయారు చేసిన హెర్బల్ టీ మరింత ఉపయుక్తం. రునిచి కోరుకునే వారు బెల్లం, నిమ్మరసం జత చేసుకోవచ్చు. రోజులో రెండుసార్లు ఇది తీసుకోవాలి.
10. పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.

