హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ “సెవెన్”. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 5న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హవీష్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో “ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి విక్టరీ మీకు ఎలా అనిపించింది?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పదించిన హవీష్ “మార్పు మంచిదే. కొంతమంది అతనికి ఎటువంటి అనుభవం లేదు అని అంటున్నారు. కానీ నేను ఆయనని వేరే కోణంలో చూస్తున్నాను. ఆయన యువకుడు మరియు విద్యావంతుడు. ఆయన పాలన ఎలా ఉంటుందో తెలియాలంటే.. కొంతకాలం వేచి చూడక తప్పదు” అని తెలిపారు.
previous post
next post