telugu navyamedia
సినిమా వార్తలు

స్లిమ్ లుక్ లో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కీర్తి

Keerthi-suresh

ఇప్పటివరకూ బొద్దు బొద్దు అందాలతో ప్రేక్షకుల్ని కవ్వించిన కీర్తి సురేశ్ ఇప్పుడు బాగా స్లిమ్‌గా మారిపోయింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ జిమ్ చేస్తూ స్వేదం చిందిస్తూ అసలు ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్‌తో పాటు స్టైలిష్ లుక్‌లో మేకప్‌తో తీసుకున్ని కొన్ని ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది కీర్తి సురేశ్. ప్రస్తుతం కీర్తి సురేశ్ మూడు భాషల్లో మూడు విలక్షణమైన చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో “మహానటి” తర్వాత కీర్తి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. మహేశ్ కోనేరు నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇక మలయాళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మోహన్ లాల్ హిస్టారికల్ డ్రామా “మరక్కార్”లోనూ కీర్తి కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తోన్న ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లోనూ కీర్తి హీరోయిన్‌గా ఎంపికైంది. ‘బదాయీ హో’ ఫేమ్ అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మొత్తంమీద కమర్షియల్ పంథాకు భిన్నంగా వెళుతోన్న కీర్తి ఈ సినిమాలతో ఎలాంటి విజయాల్ని సాధిస్తుందేమో చూడాలి.

Related posts