గతంలో అద్భుతమైన సినిమాలు తీసి దక్షిణాదిలోనే అగ్రదర్శకుడు అనిపించుకున్న శంకర్ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. పైగా సినిమా బడ్జెట్‌ను విపరీతంగా పెంచేస్తాడని, సుదీర్ఘకాలం పాటు షూటింగ్ చేస్తాడని అపకీర్తిని కూడా మూటకట్టుకున్నాడు. రజినీకాంత్‌తో తీసిన “రోబో-2” కలెక్షన్లు భారీగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువకావడంతో కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ పరాజయం శంకర్ తర్వాతి సినిమా “భారతీయుడు-2″పై తీవ్ర ప్రభావం చూపుతోంది. “2.0”ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే “భారతీయుడు-2″ను నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తవగానే వారికి అనుమానం మొదలైంది. “2.0” తరహాలోనే ఈ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలుస్తుందేమోననే భయం మొదలైంది. దీంతో శంకర్‌కు షరతులు విధించారు. అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయాలని సూచించారు. దీనికి శంకర్ అంగీకరించలేదు. దీంతో సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది. అయితే నిర్మాతల షరతులకు శంకర్ అంగీకరించడంతో “భారతీయుడు-2” త్వరలోనే మళ్లీ పట్టాలెక్కనున్నట్టు సమాచారం. తాజా అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేయాలి. ఒకవేళ ఖర్చు పెరిగితే శంకర్ తన పారితోషికం నుంచే పెట్టుకోవాలి. దీనికి శంకర్ అంగీకరించడంతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.
previous post
next post