telugu navyamedia
క్రైమ్ వార్తలు

క‌ర్ణంగూడ వ‌ద్ద కాల్పులు క‌ల‌క‌లం : ఇద్ద‌రు రియల్టర్లు మృతి

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధి కర్ణంగూడ దగ్గర‌ కాల్పులు కలకలం రేపుతున్నాయి.ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…. మరొకరు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

హైదరాబాద్‌ నగరంలోని శ్రీనువాస‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లు రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలనే 10 ఎకరాలను వీరిద్దరూ ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశారు. అయితే ఇంద్రారెడ్డి విక్రయించిన భూమిలో మట్లారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు.

ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి రెడ్డిలు కర్ణంగూడకు వచ్చారు. ఆ సమయంలో మట్టారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. భూమి విషయమై మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య 6 నెలలుగా భూ వివాదం జరుగుతోంది. ఈ క్ర‌మంలో మట్టారెడ్డి మాట్లాడుకుందామని పిలవడంతోనే వెంచర్ వద్దకు వెళ్లిన రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి,, రఘులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనకు సంబంధించి మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లతో కలిసి మరో వ్యక్తి కూడా కారులో ప్రయాణించినట్టుగా సమాచారం. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరనే విషయమై దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవాళ ఉదయమే రియల్ ఏస్టేట్ పని మీద బయటకు వెళ్తున్నట్టుగా రఘునందన్ రెడ్డి తన భార్యకు చెప్పారు. ఇంటి నుండి ఉదయం 5 గంటలకు బయలు దేరారు. ఉదయం 8 గంటల సమయంలో గొడవ జరిగిందని సమాచారం. అదే సమయంలోనే కాల్పులు జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే కాల్పులు ఎవరు జరిపారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అక్కడిక్కడే మరణించారు. రాఘవేందర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రాఘవేందర్ రెడ్డిని బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Related posts