టెక్సాస్‌కు చెందిన డోనా రైట్ మార్స్ అనే మహిళ తన మనవలు… 16 నెలల కవలలిద్దరినీ తీసుకొని వరండాలోకి రాబోయింది. అప్పుడు అక్కడ ఉన్న ఓ కుర్చీ కింద బ్లాక్‌విడో జాతికి చెందిన ఓ నల్లసాలీడు గూడు కట్టుకుంది. అలా సాలీడు గూడులో చిక్కుకున్న పామును చూసి ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ బ్లాక్‌విడో సాలీడు మామూలుది కాదు. మహా అయితే అంగుళన్నర పెరిగే ఈ సాలీడు కాటు మామూలు పాము కాటుకన్నా 15 రెట్లు విషపూరితం. దీని చెరలో చిక్కిన ఆ పాము కాసేపు పెనుగులాడబోయింది. గానీ, ఒక్కసారి ఆ సాలీడు కాటందుకోగానే చలనం లేకుండా ఉండిపోయింది. అప్పటికింకా ప్రాణాలతోనే ఉన్న ఆ పామును చూసిన డోనా జాగ్రత్తగా వెళ్లి ఆ సాలీడును చంపేసింది. దాని చెరలో చిక్కిన పామును పట్టుకొని ఇంటికి దూరంగా తీసుకెళ్లి పారేసింది. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను, ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్న ఆమె… తన మనవళ్లు ఆడుకొనే ఆటవస్తువులన్నీ వరండాలోనే ఉన్నాయని, పిల్లల కన్నా ముందు తాను ఈ జీవులను చూడటం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకుంది.
previous post
next post